రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ : సీఎం రేవంత్
వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat
వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాలు, వానాకాలం పంటల సాగు, సీజనల్ వ్యాధులపై అప్రమత్తత, రేషన్ కార్డుల పంపిణీ పురోగతి అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భారీ వర్షాల వల్ల ఏ ప్రమాదం కలగకుండా చూడాలని, వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాల వల్ల ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూడాలని, పిడుగుపాటుకి మానవ, జంతు నష్టం జరగకుడదని.. ఒకవేళ జరిగితే వెంటనే నష్ట పరిహారం ఆందేలా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. మండల, గ్రామ స్థాయి అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు.
సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్ రాకుండా తగు చర్యలు తీసుకోవాలని, దోమల వ్యాప్తి జరగకుండా, శానిటేషన్ చర్యలు వెంట వెంటనే తీసుకోవాలని .. డాక్టర్ లు విధిగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కలెక్టర్ లు ఆకస్మిక తనిఖీలు చేయాలని.. క్షేత్ర స్థాయిలో పరిశీలనలు జరగాలని సూచించారు.
యూరియా స్థాక్ మీద ప్రజలకు వాస్తవాలు తెలిసేలా ఫెరిలైజర్ షాప్ ల బయట డిస్ప్లే చేయాలని,రెవెన్యూ , పోలీస్ సిబ్బందిని నియమించాలని సూచించారు. వ్యవసాయనికి కాకుండా ఇతర అవసరాల కోసం దారి మళ్లీస్తే కఠిన చర్యలు తీసుకోవాలని.. ఎరువుల మీద కంప్లైంట్ లు ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి అని సూచించారు.
3 కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని , కొత్త రేషన్ కార్డు, అలాగే మార్పులు, చేర్పులు పూర్తి స్థాయిలో జరగాలని... ఈ నెల 25 నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాలలో రేషన్ కార్డులను పంపిణి చేయాలని సూచించారు. ప్రతీ మండలానికి ఒక అధికారిని నియమించి రేషన్ కార్డులు ఎన్ని ఇస్తున్నారు, తదితర విషయాలు ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎం తెలిపారు. డీలర్ల దగ్గర ఎంత స్థాక్ ఉందొ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అన్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో పనిచేసే ముందస్తు కమాండ్ కంట్రోల్ నుండి సమాచారం సేకరించి వర్షాలు అధికంగా పడినప్పుడు ఎక్కువగా గంటలు ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా, తద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, NDRF, రిస్క్ టీమ్ లను పంపి తగిన జాగ్రత్తలు చేపట్టాలని సీఎం సూచించారు.