హైదరాబాద్: రాష్ట్రంలో వీధిదీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి టెండర్స్ ఆహ్వానించాలి..అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐసీసీసీలో మున్సిపల్ , పంచాయతీరాజ్, జీహెచ్ ఎంసీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీధి దీపాలకు సోలార్ పవర్‌ను వినియోగించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలి. రాష్ట్రంలోని అన్ని వీధి దీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలి. ఏఐతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయాలి. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణను గ్రామా పంచాయతీలకు అప్పగించాలి. వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ అధికారం సర్పంచ్‌లదే. ఎంపీడీవో స్థాయిలో పర్యవేక్షణ చేయాలి. ప్రతి పోల్ సర్వే చేయించాలి..అని సీఎం రేవంత్ సూచించారు.