నోవోటెల్ హోటల్‌లో సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం

శంషాబాద్ నోవోటెల్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది.

By Knakam Karthik
Published on : 15 April 2025 3:49 PM IST

Telangana, CM Revanthreddy, Hyderabad, Shamshabad Novotel, Lift Struck

నోవోటెల్ హోటల్‌లో సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం

శంషాబాద్ నోవోటెల్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. నోవోటెల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్టులో స్వల్ప అంతరాయం ఏర్పడింది. వాస్తవానికి ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్టులో .. ఏకంగా 13 మంది ఎక్కారు. ఓవర్ వెయిట్ కారణంగా ఆ లిఫ్టు మొరాయించింది. ఎక్కువమంది ఎక్కడంతో ఉండాల్సిన ఎత్తుకంటే కిందికి లిఫ్ట్ దిగింది.

దీంతో ఒక్కసారిగా అధికారులు టెన్షన్ పడ్డారు. అటు హోటల్ సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. లిఫ్ట్ ఓపెన్ చేసి సీఎం రేవంత్ రెడ్డిని వేరే లిఫ్టులో సెకండ్ ఫ్లోర్‌కు పంపారు అధికారులు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి నోవాటెల్ లో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడ ఉన్న నేతలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story