బ‌ర్త్‌డే రోజు యాదాద్రికి సీఎం రేవంత్‌..!

ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు.

By Kalasani Durgapraveen  Published on  5 Nov 2024 1:13 PM IST
బ‌ర్త్‌డే రోజు యాదాద్రికి సీఎం రేవంత్‌..!

ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వలిగొండ మండలం సంగెం గ్రామంలో మూసి వంతెన వద్ద మూసి పునర్జీవంపై రైతులతో మాట్లాడి.. స‌మావేశంలో ప్ర‌సంగిస్తారు.

సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లా పర్యటన సందర్భంగా సభా స్థలం ఏర్పాట్లను భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మ రెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనమంత రావు, డీసీపీ రాజేష్ చంద్రలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story