సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేపు మూడు సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు నిజామాబాద్, మద్యాహ్నం 1.30 గంటకు మంచిర్యాల, సాయంత్రం 3.30 గంటలకు కరీంనగర్ లలో జరిగే సభలలో పాల్గొని ప్రసంగించనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలలో సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు, జిల్లాల మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజా నర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నారు. సభలకు పట్టభధ్రులు భారీగా తరలి రావాలని టీపీసీసీ పిలుపు ఇప్పటికే పిలుపునిచ్చింది.