హైదరాబాద్: మేడారం మహా జాతర 2026 పోస్టర్‌ను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026 జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరగనుంది. మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి, అడ్లూరి పాల్గొన్నారు.
కాగా మేడారం మహా జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ భారీ జనసందోహానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.