తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23వ తేదీ తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీప్ మహేశ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి హైకమాండ్ పెద్దలతో సమావేశం కానున్నారు. డీసీసీలు, పార్టీ నేతల మధ్య వివాదాలు, బీసీ రిజర్వేషన్లపై హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ చర్చించనున్నారు.