సౌదీలో తెలంగాణ వాసుల మరణంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి, కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు

సౌదీ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్టు వస్తున్న వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

By -  Knakam Karthik
Published on : 17 Nov 2025 9:50 AM IST

Telangana, Hyderabad News, Cm Revanthreddy, Congress Governement, Saudi Arabia bus accident, Mecca

సౌదీలో తెలంగాణ వాసుల మరణంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి, కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్టు వస్తున్న వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఈ మృతుల కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతోపాటు వారి కుటుంబాలకు తగు సహాయాన్ని అందించేందుకు గాను వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ తోను, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నేడు మాట్లాడడం జరిగింది.

సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ ఏర్పాటు చేసినట్టు చీఫ్ సెక్రటరీ తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో ఈ క్రింది నెంబర్ల ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.

+91 79979 59754,

+91 99129 19545.

Next Story