కేసీఆర్ అనే పదమే కనిపించదన్న సీఎం రేవంత్.. కౌంటర్ ఇచ్చిన బీఆర్‌ఎస్
ఏడాదిలో కేసీఆర్ పేరు కనిపించబోదన్న సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ కౌంటర్ ఇచ్చింది.
By అంజి Published on 30 Oct 2024 10:24 AM ISTకేసీఆర్ అనే పదమే కనిపించదన్న సీఎం రేవంత్.. కౌంటర్ ఇచ్చిన బీఆర్‌ఎస్
ఏడాదిలో కేసీఆర్ పేరు కనిపించబోదన్న సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ కౌంటర్ ఇచ్చింది. 'చెరిపేయడానికి అది నీలాంటి తలకుమాసిన పెయింటర్ పాత గోడల మీద రాసిన పేరు కాదు' అని తీవ్రంగా స్పందించింది. తెలంగాణలోని సబ్బండ వర్గాలు గుండెల మీద శాశ్వతంగా ముద్రించుకున్న పేరు కేసీఆర్ అని ఓ వీడియోను షేర్ చేసింది. అటు బీఆర్‌ఎస్ శ్రేణులు సైతం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని ఆపై కేసీఆర్ అనే పదమే కనిపించదని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆయన కుటుంబంలో గొడవలు నడుస్తాయి. బావతో బావమరిది రాజకీయం ముగుస్తుంది. కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడాను. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా బావ హరీశ్‌ను వాడతాను. ఇద్దరినీ ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. రాజ్ పాకాల ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయి. దీపావళి పార్టీ అని ఎలా అంటారు' అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
కేసీఆర్! చెరిపేయడానికి అది నీలాంటి తలకుమాసిన పెయింటర్పాతగోడల మీద రాసిన పేరు కాదు.అది తెలంగాణలోని సబ్బండ వర్గాలుతమ గుండెల మీద శాశ్వతంగా ముద్రించుకున్న పేరు! జై తెలంగాణ ✊ pic.twitter.com/ynhWvreNpT
— BRS Party (@BRSparty) October 30, 2024