పురపాలక శాఖపై సీఎం రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.

By Knakam Karthik
Published on : 26 Jun 2025 7:20 AM IST

Telangana, Cm Revanthreddy, Hyderabad, Congress Govt, Municipal Department, Development Works

పురపాలక శాఖపై సీఎం రేవంత్ రివ్యూ..అధికారులకు కీలక ఆదేశాలు

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో అభివృద్ధి పనుల గురించి అధికారులు వివరించారు. పట్టణాల్లో, నగరాల్లో అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో శానిటేషన్‌, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థపై చర్యలు తీసుకోమని ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచే చోట ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓఆర్‌ఆర్‌ వరకు కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో భవిష్యత్‌ అవసరాలకు ప్రణాళికలు చేయాలన్నారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్‌ కారిడార్లపై పూర్తి ప్రణాళికతో రావాలని చెప్పారు. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ప్లాన్​ చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. నగరంలో శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, చికున్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోడ్డుపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వానాకాలంలో డ్రైనేజ్ ఓవర్ ఫ్లో ఉండకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. తాగునీరు కలుషితం కాకుండా చూడటంతో పాటు, దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Next Story