కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

By అంజి  Published on  24 July 2024 6:15 AM GMT
CM Revanth Reddy, KTR, Telangana

కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరుకున్నారు. కేటీఆర్‌కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలన్నారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు 1976 జూలై 24 న సిద్ధిపేటలో జ‌న్మించారు. ఆయన రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప‌ట్టాల‌ను క‌లిగి ఉన్నారు. ఒక‌టి న్యూయార్క్ యూనివ‌ర్సిటీ కాగా.. మ‌రొక‌టి పుణెలో బ‌యోటెక్నాల‌జీలో పొందారు. 2006 లో టీఆర్‌ఎస్ లో చేరి తనదైన ముద్ర వేసుకున్నారు. కేటీఆర్ ఐటీ, వాణిజ్య‌ శాఖగా మంత్రిగా క్యాబినెట్ మంత్రి హోదాలో ప‌నిచేశారు. సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

Next Story