నేడు ప్రధాని మోదీతో భేటీకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు.

By అంజి  Published on  26 Dec 2023 6:33 AM IST
CM Revanth Reddy, PM Modi, Telangana

నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ ఖరారు అయింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అమలు కావాల్సిన హామీలు, ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై మోదీతో వారు చర్చించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రేవంత్‌ రెడ్డి ప్రధాని మోడీతో భేటీ కానుండటం ఇదే మొదటిసారి.

మరోవైపు ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వారితోపాటు టికెట్లు త్యాగం చేసిన కాంగ్రెస్‌ నేతలు నామినేటెడ్‌ పోస్టుల కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి కాంగ్రెస్‌ జాతీయ పెద్దలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్నారు. ఎమ్మెల్సీ పదవులు, లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై కీలకంగా చర్చించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story