తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.

By Medi Samrat  Published on  9 Dec 2024 7:01 PM IST
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, అధికారుల సమక్షంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుండుపూసలు, హారం, ముక్కుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్న కంకులు తెలంగాణ తల్లి చేతిలో పొందుపరిచారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్తగా రూపొందించారు. 2024 ఆగస్టు 28న రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

Next Story