ఢిల్లీకి తెలంగాణ సీఎం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరద నష్టాలకు సంబంధించి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ 6న ఢిల్లీకి వెళ్లనున్నారు

By M.S.R  Published on  5 Oct 2024 8:35 AM IST
ఢిల్లీకి తెలంగాణ సీఎం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరద నష్టాలకు సంబంధించి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ 6న ఢిల్లీకి వెళ్లనున్నారు. సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాల వల్ల రూ. 10,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వరద సహాయ నిధులు రూ.416.80 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో మరిన్ని నిధులు రాబట్టడం కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.

తన పర్యటనలో రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్ర హోం మంత్రుల సమావేశంలో కూడా పాల్గొంటారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమై మరిన్ని విషయాలపై చర్చించనున్నారు. తెలంగాణలో భారీ వరదల నేపథ్యంలో కేంద్ర బృందం ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించి నష్టాలను అంచనా వేసింది. కేంద్రం తొలుత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండింటికీ తక్షణ సాయంగా రూ.3,300 కోట్లు అందించింది. ఇటీవల 14 రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) కింద అదనంగా రూ.5,858 కోట్లు విడుదల చేయగా, అందులో తెలంగాణకు రూ.416.80 కోట్లు మాత్రమే అందాయి.

Next Story