హైదరాబాద్‌కు తీరనున్న తాగునీటి కష్టాలు..రేపు వాటర్ స్కీమ్‌కు సీఎం శంకుస్థాపన

మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్– II & III కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు

By Knakam Karthik
Published on : 7 Sept 2025 7:45 PM IST

Telangana, Hyderabad, Cm Revanthreddy, Drinking Water Scheme

హైదరాబాద్‌కు తీరనున్న తాగునీటి కష్టాలు..రేపు వాటర్ స్కీమ్‌కు సీఎం శంకుస్థాపన

హైదరాబాద్: మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్– II & III కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపుతారు. రూ.7360 కోట్లతో ప్రభుత్వం హమ్ విధానంలో ఈ ప్రాజెక్టును చేపడుతుంది. రెండేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు. అందులో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపి మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలు కేటాయిస్తారు. మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. డిసెంబర్ 2027 నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు, ప్రతి రోజు నల్లా నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును లక్ష్యంగా ఎంచుకున్నారు.

Next Story