ఈరోజు నా జన్మదినం కాదు.. నా జన్మధన్యం : సీఎంరేవంత్
ఈరోజు నా జన్మదినం కాదు.. నా జన్మధన్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
By Medi Samrat Published on 8 Nov 2024 3:28 PM GMTఈరోజు నా జన్మదినం కాదు.. నా జన్మధన్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేసిన సీఎం మాట్లాడుతూ.. సంగెం ప్రాంతంలో కుల వృత్తులు చేసుకొనే అనేక ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ జిల్లా ప్రజలు ఒక పక్క ప్లోరైడ్, మరో పక్క మూసి నీళ్లతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో హైదరాబాద్ ప్రజలకు జీవ నదిగా మూసీ ఉండేది.. నల్లగొండ ప్రాంత ప్రజలకు పాడి పంటలకు నెలువుగా గతంలో మూసీ ఉండేదన్నారు.
నా జన్మదినం రోజు నల్లగొండ ప్రజలు వేళ మంది నాకోసం వచ్చారు. పొద్దటి నుంచి అన్నం తినకుండా మూసీ పునరుజ్జీవం కావాలని ధృడ సంకల్పంతో ఇంతసేపు ఉన్నారు. మూసీలో చేపలు బ్రతికే పరిస్థితి లేదు.. మూసీ పక్కన పెంచే గొర్రెలను కొనే పరిస్థితి లేదు. నల్లగొండ, రంగారెడ్డి బిడ్డలను కాపాడుకునేందుకే మూసీ పునరుజ్జీవం చేస్తానన్నారు.
దేవుడు నాకు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చాడు.. ఈ అవకాశంతోనే నడుం బిగించి మూసి పునరుజ్జీవం చేసేందుకు అడుగు ముందుకు వేశానన్నారు. మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుందన్నారు. మూసీ పునరుజ్జీవాన్ని స్వాగతించిన సిపిఐ, సిపిఎం పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.
మూసీపై లక్ష యాభై వేల కోట్లని.. నేను దోచుకుంటున్న అని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ తెచ్చిన ధరణిలో అభ్రక దభ్రక చేస్తే వేళ కోట్ల రూపాయలు వస్తాయి. బుల్ డోజర్లకు అడ్డంగా పడుకునే నాయకుల పేర్లు చెప్పండి. బిల్లా, రంగడు దమ్ముంటే బుల్ డోజర్లకు అడ్డంగా పడుకోవాలన్నారు. తేది, టైమ్ చెప్తే కోమటి రెడ్డి వెంకట రెడ్డీనే బుల్ డోజర్ నడిపిస్తాడు, మందుల సామెల్ జెండా ఊపుతాడన్నారు. ప్రజల అండతోనే మేము పదవిలో ఉన్నాము. నల్లగొండ జిల్లాలో మూడు అడుగులోడు ( జగదీష్ రెడ్డిని ఉద్దేశించి) జర్రలో గెలిచాడని ఎద్దేవా చేశారు. నల్లగొండ గడ్డ ఉద్యమాల గడ్డ.. వారి పౌరుషం ఏంటో మూసీని అడ్డుకుంటే చూపిస్తారన్నారు.
మూసీ పునరుజ్జీవం వద్దంటే నల్లగొండ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. బిర్లా, రంగడు, చార్లెస్ చాబేజ్ దమ్ముంటే మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకొండి చూద్దాం.. హరీష్ రావు సవాల్ ను స్వీకరిస్తున్న దమ్ముంటే మూసీ వెంట పాదయాత్ర చెయ్ అని సవాల్ విసిరారు.