లగచర్ల దాడి కేసులో నిందితుడు ఈర్యా నాయక్‌కు ఛాతీ నొప్పి రాగా అతనిని జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అతడి చేతికి బేడీలు వేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఈర్యా నాయక్‌కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.
జైల్లో ఉన్న ఈర్యా నాయక్ కు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో అతనిని తొలుత సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రైతుకు గుండెపోటు రావడంతో పంజాగుట్టలోని నిమ్స్‌కు తరలించారు. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో అతనికి చికిత్స అందిస్తున్నారు. అతడు బేడీలతో ఆసుపత్రిలో ఉన్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.