వాళ్ళకే మొదట ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన గృహ నిర్మాణ పథకం ‘ఇందిరమ్మ ఇల్లు’ కేటాయింపులో వ్యవసాయ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వికలాంగులు, వ్యవసాయ భూములు లేని వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

By Kalasani Durgapraveen  Published on  30 Nov 2024 7:00 AM IST
వాళ్ళకే మొదట ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన గృహ నిర్మాణ పథకం ‘ఇందిరమ్మ ఇల్లు’ కేటాయింపులో వ్యవసాయ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వికలాంగులు, వ్యవసాయ భూములు లేని వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ పథకం అమలుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేదలే ఈ పథకంలో మొదటి లబ్ధిదారులు అవుతారని అన్నారు. లబ్ధిదారులు ఆసక్తి చూపితే ఆ ఇళ్లలో కూడా అదనపు గదులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. పథకం అమలులో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

హౌసింగ్ శాఖను పటిష్టం చేసేందుకు అందులోని ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) పరిధిలో నివసిస్తున్న ఆదివాసీలకు ఈ పథకం కింద ఇళ్ల కేటాయింపు కోసం ప్రత్యేక కోటా కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి గ్రామ కార్యదర్శి, మండల స్థాయి అధికారులు బాధ్యత వహించాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు మొబైల్ యాప్‌తో ఎలాంటి సమస్యలు ఉండకూడదన్నారు.

Next Story