బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మాస్టర్ ప్లాన్ పై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్నారు. ఈ నెల 6న సీఎం బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు.