సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు తీపి కబురు అందించారు. రైతు భరోసా పథకంలో భాగంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ₹3,600 కోట్ల నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. నేడు (ఆదివారం) బ్యాంకులకు సెలవు కావడంతో, ఈ నిధులు రేపటి (సోమవారం) నుండి రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. కేవలం 45 రోజుల వ్యవధిలోనే మూడు విడతలుగా మొత్తం ₹9,000 కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు ప్రకటించారు. పంట పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూడకుండా, సకాలంలో నిధులు అందజేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.