సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్న సీఎం

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు.

By Medi Samrat  Published on  28 Nov 2024 8:45 AM GMT
సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్న సీఎం

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ వివరాలు ఎన్యుమరేటర్, అధికారులు నమోదు చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సర్వే పురోగతిపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని సీఎం అధికారులను ఆరా తీశారు. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీలయినంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Next Story