రామోజీరావును కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావును సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. సోమవారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రామోజీ రావుతో చర్చించారు

By Medi Samrat  Published on  4 March 2024 3:30 PM GMT
రామోజీరావును కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావును సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. సోమవారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రామోజీ రావుతో చర్చించారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి రామోజీరావును కలుసుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి రామోజీరావుతో కలవడం ఇదే మొదటిసారి. ఈ భేటీలో రామోజీరావు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సోమవారం ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లెక్చరర్లు, టీచర్ల ఉద్యోగాలకు ఎంపికైన 5,192 మందికి నియామక పత్రాలను అందించారు. తమ ప్రభుత్వం మూడు నెలల్లోనే 30వేల మందికి నియామక పత్రాలను అందించిందన్నారు. తెలంగాణ సాధనలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులది కీలక పాత్ర అన్నారు. విద్యార్థులు, యువత త్యాగాలు, బలిదానాలతో తెలంగాణ సాకారమైందన్నారు. అయితే గత పదేళ్లు యువతకు ఎంతో అన్యాయం జరిగిందని అన్నారు.

Next Story