'అధికారం పోయినా అహం తగ్గలేదు'.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ సీఎం రేవంత్‌

తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర సెక్రటేరియట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

By అంజి  Published on  20 Aug 2024 1:30 PM IST
CM Revanth Reddy, KTR, Telangana, Telangana Talli, RajivGandhi

'అధికారం పోయినా అహం తగ్గలేదు'.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ సీఎం రేవంత్‌ 

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర సెక్రటేరియట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాజీవ గాంధీ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతలకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదన్నారు. సెక్రటేరియట్‌ ముందు తన తండ్రి విగ్రహాన్ని పెట్టుకోవాలని కేటీఆర్‌ భావిస్తున్నారని అన్నారు. పదేళ్లు మౌనంగా ఉన్నవాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

డిసెంబర్‌ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దేశం కోసం చనిపోయిన రాజీవ్‌గాంధీపై కేటీఆర్‌ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కల అని సీఎం రేవంత్‌ అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేదన్నారు. అంతకుముందు దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి రేవంత్‌ పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు. రాజీవ్‌ గాంధీ ఒక స్ఫూర్తి అని రేవంత్‌ పేర్కొన్నారు. పారిశ్రామిక విప్లవం, కంప్యూటర్‌, ఐటీని భారత్‌కు పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్‌ గాంధీ అని కొనియాడారు.

Next Story