అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సీఎం రేవంత్ ఫైర్..ఎథిక్స్ కమిటీకి సిఫార్సు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

By -  Knakam Karthik
Published on : 29 March 2026 4:10 PM IST

Telangana Assembly, CM RevanthReddy, KaushikReddy, Ethics Committee, BRS, Congress, Assembly Politics, BudgetSession2026

అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సీఎం రేవంత్ ఫైర్..ఎథిక్స్ కమిటీకి సిఫార్సు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో కౌశిక్ రెడ్డి అనుసరిస్తున్న తీరు అత్యంత అసభ్యకరంగా ఉందని, ప్రజాస్వామ్య దేవాలయంలో ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిని గౌరవించకుండా, దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానించేలా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా సభా మర్యాదలను ఉల్లంఘిస్తున్న కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి స్పీకర్‌ను కోరారు. సభలో గందరగోళం సృష్టిస్తూ, చర్చకు అడ్డుపడుతున్న తీరును ఎండగట్టిన సీఎం, ఇదే ధోరణి కొనసాగితే బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సదరు సభ్యులను సస్పెండ్ చేయక తప్పదని గట్టిగా హెచ్చరించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సభను రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని, నిబంధనల ప్రకారం కౌశిక్ రెడ్డిపై తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.

Next Story