గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్‌

కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఉద‌యం ఓ ట్వీట్‌లో కేసీఆర్ గురించి ప్ర‌స్తావిస్తూ..

By Medi Samrat  Published on  30 April 2024 10:14 AM IST
గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్‌

కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఉద‌యం ఓ ట్వీట్‌లో కేసీఆర్ గురించి ప్ర‌స్తావిస్తూ.. కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే లో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్ లు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారు. (తేదీ 12-05-2023 నుండి 05-06-2023 వరకు). అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట అని మండిప‌డ్డారు.

అంత‌కుముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్విట్టర్‌లో (ఎక్స్‌)లో యూనివర్సిటీ చీఫ్‌ వార్డెన్‌ జారీ చేసిన నోటీసును పోస్టుచేసి కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో కరెంటు, తాగు, సాగునీటి కొరతలకు ఈ నోటీసు నిదర్శనమని.. సీఎం, డిప్యూటీ సీఎం నాలుగు నెలలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. యూనివర్సిటీ చీఫ్‌ వార్డెన్‌ జారీ చేసిన నోటీసు సీఎం, డిప్యూటీ సీఎం చెప్తున్నవి అవాస్తవమని స్పష్టం చేస్తున్నది. తెలంగాణలో కరెంటు, తాగు, సాగునీటి కొరత ఉన్నదనేది వాస్తవం’ అని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో ఈ పోస్టు వైరల్‌గా మారింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపారు. చీఫ్‌ వార్డెన్‌కు ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ షోకాజ్‌ నోటీసు జారీచేశారు. ఆ నోటీసుపై సీఎం రేవంత్ తాజాగా స్పందించారు.


Next Story