మోసమనే పదానికి ప్రత్యామ్నాయం సబిత : సీఎం రేవంత్
మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితా ఇంద్రారెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 31 July 2024 12:24 PM GMTమోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితా ఇంద్రారెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఇరువురి మధ్య ఘాటు చర్చ జరిగాక బయట మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. సబితపై వ్యక్తిగతం ఏముంది.. సునీత ప్రచారంకు వెళితే నాపై రెండు కేసులు అయ్యాయి. సునీత మహిళా కమీషన్ చైర్మన్ అయ్యింది .. నాపై కేసులా..? అని ప్రశ్నించారు. నన్ను కాంగ్రెస్ లోకి రమ్మన్న అక్క.. ఎందుకు బీఆర్ఎస్ లోకి వెళ్ళింది.? నేను నామినేషన్ వేసే సమయంకు ఆమె బీఆర్ఎస్ లకు వెళ్లిందని అన్నారు. సభలో డెమొక్రటిక్‌గా ఉండేందుకే వారికి సమయం ఇచ్ఛామన్నారు. జగదీశ్వర రెడ్డి , కేటిఆర్, హరీష్ లు సభలో మాకంటే ఎక్కువ సమయం మాట్లాడారన్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌కు భాధ్యత లేదు.. అధికారం ఉంటేనే.. కేసీఆర్ సభకు వస్తాడా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వైపు నుండి కంటే వాళ్లే ఎక్కువ మాట్లాడారు. మా ప్రభుత్వం డెమొక్రటిక్ గా ఉంది.. అందుకే చర్చలకు అవకాశం ఇచ్చామన్నారు. అతి చేస్తే స్పీకర్.. శాసన సభ్యుల సభ్యత్వం కూడా రద్దు చేసేయొచ్చన్నారు. మన సభలో గతంలో ఆ సంప్రదాయం కూడా ఉంది కదా.. కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వంలు రద్దు చేయలేదా.? అని గుర్తు చేశారు. నిన్న కూడా ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీ తాగి పోయారు. ఎవరినైనా కలువడం.. మాట్లాడుకోవడం సహజమైందన్నారు.