ఆరు గ్యారెంటీలు మాత్రమే కాదు.. 160 అంశాల్లో పనులు చేపట్టాం : సీఎంఓ

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మాత్రమే కాకుండా 160 అంశాల్లో పనులు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

By Kalasani Durgapraveen  Published on  7 Dec 2024 7:15 AM IST
ఆరు గ్యారెంటీలు మాత్రమే కాదు.. 160 అంశాల్లో పనులు చేపట్టాం : సీఎంఓ

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మాత్రమే కాకుండా 160 అంశాల్లో పనులు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రజలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుందని.. సుస్థిర ప్రజాస్వామిక పాలనతో దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలిపిందని పేర్కొంది. అధికారం చేపట్టినప్పటి తొలిరోజు నుంచే సీఎం రేవంత్‌ రెడ్డి అన్ని రంగాల్లో తెలంగాణ సమ్మిళిత అభివృద్థికి నిరంతరం సమీక్షలు, సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొంది. ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు గత ఏడాది డిసెంబరు నుంచి ప్రభుత్వం చేపట్టిన 160 ప్రజోపయోగ పనుల్లో ముఖ్యమైన వాటిని సీఎంవో వెల్లడించింది.

పదేళ్ల విధ్వంసపు ఆనవాళ్లను చెరిపేసి తెలంగాణ పునర్‌ వైభవాన్ని కొనసాగిస్తూనే.. సమగ్ర అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడించింది. తెలంగాణను ఫ్యూచర్‌ స్టేట్‌గా, హైదరాబాద్‌ను ఫ్యూచర్‌ సిటీగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు సీఎం రేవంత్‌ చేసిన ప్రయత్నాలు తొలి ఏడాదిలోనే సత్ఫలితాలు ఇచ్చినట్లు వివరించింది. తొలి ఏడాదే 55,143 ఉద్యోగాల భర్తీతోలక్షలాది మంది నిరుద్యోగుల ఆకాంక్షలను ప్రజాప్రభుత్వం నెరవేర్చింది. కాగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. వానాకాలం సీజన్‌ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ఉంది. 67లక్షల ఎకరాల్లో వరి సాగు చేేస్త.. 153 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. 25లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేశాం. ఐదేళ్లలో 30లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చేలా పనులు ప్రారంభించాం అని పేర్కొంది తెలంగాణ సర్కార్.

మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సగటున 30లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారికి రూ.1500 కోట్ల ఆదా చేయగలిగామని సీఎంవో వెల్లడించింది. మహిళలకు వడ్డీలేని రుణాల పునరుద్ధరణ. రుణ బీమాతోపాటు సంఘం సభ్యురాలికి రూ.10లక్షల ప్రమాద బీమా అమలు చేస్తున్నట్లు తెలిపింది. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకంతో 40లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందని పేర్కొంది. గృహజ్యోతి పథకం కింద అరకోటి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నట్లు తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి ఏడాదిలోనే 4.50లక్షల ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్‌ యాప్‌ను ప్రారంభించాం... రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకంలో ఉచిత వైద్యం పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాం. కొత్త ఆర్వోఆర్‌ ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణను ఇప్పటికే పూర్తి చేశాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించి... కొత్త చట్టం తీసుకొస్తాం అని తెలంగాణ సర్కార్ తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణకు జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేశాం. మహిళాశక్తి సంఘాల ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాం. గతంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లలో అవకతవకలపై విచారణకు జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేశాం. ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించడంతోపాటు ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఈహెచ్‌ఎస్‌ పథకంలో మార్పులు చేశాం అని తెలంగాణ సర్కార్ పేర్కొంది .

Next Story