కేసీఆర్ కాలు విరిగిందని.. కూతురు జైలుకు వెళ్లిందని జాలి చూపించాము

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ భాష సరిగ్గా లేదని అన్నారు.

By Medi Samrat  Published on  6 April 2024 9:15 PM IST
కేసీఆర్ కాలు విరిగిందని.. కూతురు జైలుకు వెళ్లిందని జాలి చూపించాము

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ భాష సరిగ్గా లేదని అన్నారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటారని అనుకుంటున్నారు.. కానీ కేసీఆర్ ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదన్నారు. ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లలో వందేళ్ల విధ్వంసం కేసీఆర్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాలు విరిగిందని.. కూతురు కవిత జైలుకు వెళ్లిందని జాలి చూపించామన్నారు.

కేసీఆర్ భాషను చూసి జనం చీదరించుకుంటున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ భాషను చూసి ప్రజలే తిరగబడతారని.. కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయటానికి కేటీఆర్ కు బుద్ధి ఉండాలని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది అని, రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు. 2009లో రాహుల్ కి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తిరస్కరించారని అన్నారు.

Next Story