ఆ విషయంలో గందరగోళం తలెత్తింది.. పీసీసీ బాధ్యతల నుంచి నన్ను తప్పించండి : సీఎం రేవంత్ రెడ్డి

జీవన్ రెడ్డి విషయంలో మా వైపు సమన్వయం లేక గందరగోళం తలెత్తిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు

By Medi Samrat  Published on  27 Jun 2024 7:44 AM GMT
ఆ విషయంలో గందరగోళం తలెత్తింది.. పీసీసీ బాధ్యతల నుంచి నన్ను తప్పించండి : సీఎం రేవంత్ రెడ్డి

జీవన్ రెడ్డి విషయంలో మా వైపు సమన్వయం లేక గందరగోళం తలెత్తిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి అనుభవాన్ని దృష్ఠిలో ఉంచుకొని వారి గౌరవానికి భంగం కలగనివ్వమ‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకుంటామ‌న్నారు. మా ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణ మాఫీ, ఆరు గ్యారెంటీ లను చూసి జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ కుమార్ పార్టీలో చేరారని తెలిపారు. మేము సమర్థవంతంగా ప్రభుత్వం నడుపుతున్నామ‌ని.. ఏ శాఖ కూడా ప్రస్తుతం ఖాళీగా లేదన్నారు. శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని.. విద్యా శాఖ సజావుగా అన్ని పరీక్షలు నిర్వహిస్తుంద‌న్నారు.

ఫిరాయింపు సంస్కృతికి తెర లేపింది కేసీఆర్ అన్నారు. ఆయన ముందుగా అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకి రాయాలని డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం పడి పోతుందన్న కేసీఆర్ ను ఏం చేయాలని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ను ఓడించడానికి బీఆర్ఎస్‌ 20 శాతం ఓట్లు బీజేపీకి బదిలీ చేసిందన్నారు. మోదీ కాళ్ళు పట్టుకుని మా ప్రభుత్వం పడేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు.

విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కావాలనే జగదీశ్వర్ రెడ్డి అడిగారన్నారు. కేసీఆర్ విద్యుత్ కమిషన్ ముందు హాజరై తన వాదన వినిపించాలన్నారు. అది లైవ్ టేలికాస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు. పీసీసీ బాధ్యతల నన్ను తప్పించి, కొత్త వారికి బాధ్యతలు ఇవ్వాలని.. నేను పీసీసీగా సరైన బాధ్యతలు నిర్వహించాన‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారన్నారు. కార్యకర్తల మనోభావాలు గాయపడ్డాయి అన్న భావన నేపథ్యంలో జీవన్ రెడ్డి, సీఎం రేవంత్ తో సమావేశం అయ్యారన్నారు. చిన్న చిన్న అభిప్రాయ బేధాలున్నా పార్టీ బలోపేతం కోసం పని చేస్తాన‌న్నారు.

Next Story