ప్రముఖ వార్తా సంస్థ ఆజ్ తక్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది.. దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందన్నారు. భారతదేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లు ఎందుకు అరెస్ట్ అయ్యారు.. అల్లు అర్జున్‌ను అరెస్టు చేశామంటున్నారు.. అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడన్నారు. ఘటనపై క్రిమినల్ కేసు బుక్ అయిందని.. పది రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.. జనం ప్రాణం పోయింది.. అయినా కేసు పెట్టొద్దా.? అని ప్రశ్నించారు.
ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదు.. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది.. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులూపి హడావుడి చేశారు.. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు.. కంట్రోల్ కాలేదు.. అందుకే అల్లు అర్జున్ ను ఈ కేసులో A11గా పెట్టారన్నారు. అక్కడ మహిళ ప్రాణం పోయింది.. ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు.
నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు, అతనికి నేను తెలుసు.. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత.. అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత .. నాకు బంధువు.. అల్లు అర్జున్ భార్య కూడా మాకు బంధువులవుతారన్నారు. హోం శాఖ నా వద్ద ఉంది.. ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ నాకు తెలుసు అన్నారు. చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలో ఉన్నాడన్నారు. సినిమా కోసం పైసలు పెట్టారు.. పైసలు సంపాదించారు.. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదన్నారు. నా ఫేవరెట్ హీరో కృష్ణ.. ఆయన ఇప్పుడు లేరు.. ఇప్పుడు నేనే స్టార్‌ను.. నాకే ఫాన్స్ ఉంటారు.. ఉండాలి కూడా అని అన్నారు.