ఉద్యోగ సంఘాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని, బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం మీద సమరం అంటూ ఉద్యమం చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. అందరూ కుటుంబ సభ్యులమేనని, మీకు జీతాలు ఇస్తున్న ప్రజలే మాకు ఉద్యోగాలిస్తున్నారన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే చర్చకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిందని తెలిపారు. ఇప్పుడు కావాల్సింది సమరం కాదు, సమయస్ఫూర్తి, సంయమనమని అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణను మళ్లీ కోతుల గుంపుకు అప్పగించొద్దని, తనతో కలిసి రావాలన్నారు