మ‌రో 60 రోజులలో పార్లమెంట్ ఎన్నికలు.. మంచి ఫలితాలు రావాలి : రేవంత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికలు మ‌రో 60 రోజులలో జరిగే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  30 Jan 2024 1:24 PM GMT
మ‌రో 60 రోజులలో పార్లమెంట్ ఎన్నికలు.. మంచి ఫలితాలు రావాలి : రేవంత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికలు మ‌రో 60 రోజులలో జరిగే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, విష్ణు నాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, సభ్యులు, తదితరులు స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. తెలంగాణలో కూడా రాజ్యసభ ఎన్నికల జరుగుతున్నాయని తెలిపారు. లోక సభ ఎన్నికలలో మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని శ్రేణుల‌కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేస్తోందన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు 2వ తేదీ నుంచి సభలు నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు. 2న ఇంద్ర వెళ్లి లో సభ ఉంది. పెద్దఎత్తున విజయవంతం చేయాలన్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా ఇంచార్జ్ లను నియమించామ‌ని.. పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సభలు నిర్వహించి ముందుకు పోవాలని సూచించారు.

Next Story