రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్
CM KCR Visits For Delhi. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ముందుగా రేపటి నుంచి
By Medi Samrat Published on
23 Sep 2021 2:35 PM GMT

రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ముందుగా రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జరిగే బీఏసీ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో కేసీఆర్ ఈ నెల 25న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షకావత్ తో సమావేశమౌతారు. 26వ తేదీన విజ్జానభవన్ లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమవుతారు. అనంతరం అదే రోజు సాయంత్రం హైద్రాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.
Next Story