ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. చంద్రశేఖర్ రావు మంగళవారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామమైన సైఫాయికి చేరుకుంటారు. అనంతరం ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, ఆపై అంత్యక్రియల్లో పాల్గొంటారు.
ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల సోమవారం కన్నుమూశారు. ఎటావా జిల్లాలోని సైఫాయి గ్రామంలో 1939 నవంబర్ 22న మూర్తిదేవి-సుఘర్‌సింగ్ యాదవ్ దంపతులకు ములాయం సింగ్ జన్మించారు. 1992లో ములాయం సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత యూపీలో సమాజ్‌వాదీ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చారు. మూడుసార్లు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఒకసారి రక్షణ మంత్రిగా పనిచేశారు. శాసనసభ్యుడిగా 10 సార్లు, లోక్‌సభ సభ్యుడిగా ఏడుసార్లు ఎన్నికయ్యారు.