ఓటు వేసే ముందు ఆలోచించకపోతే ఐదేళ్లు నష్టపోతారు : కేసీఆర్

కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలనలో సంక్షేమం ఎలా జరిగింది.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం ఎలా జరుగుతోందో

By Medi Samrat  Published on  26 Nov 2023 3:45 PM GMT
ఓటు వేసే ముందు ఆలోచించకపోతే ఐదేళ్లు నష్టపోతారు : కేసీఆర్

కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలనలో సంక్షేమం ఎలా జరిగింది.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం ఎలా జరుగుతోందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆదివారం ఖానాపూర్ ప్రజా ఆశీర్వాధ సభలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. తెలంగాణలో మరోసారి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలవబోతోతుందని ధీమా వ్యక్తం చేశారు. రైతు బంధు పేరుతో పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ మాత్రం మూడు గంటల కరెంట్ ఇస్తా మంటోంది.. మీకు 24 గంటల కరెంట్ కావాలా.? 3 గంటల కరెంట్ కావాలా.? అని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటోంది.. ధరణి తీసేస్తే రైతులకు మళ్లీ కష్టాలే అన్నారు. ధరణి తీసేస్తే అసలు రైతు బంధు డబ్బులు ఎలా పడతాయని ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దళారీ రాజ్యం వస్తుందన్నారు. అభ్యర్థులనే కాకుండా వాళ్ల వెనకున్న పార్టీలను చూడండి.. ఆ పార్టీల చరిత్ర తెలుసుకుని ఓటు వేయాలని సూచించారు. ఓటు వజ్రాయుధమని.. ఓటు వేసే ముందు ఆలోచించకపోతే ఐదేళ్లు నష్టపోతారన్నారు. బీఆర్ఎస్ మరోసారి గెలవగానే ఖానాఫూర్‌ను మరింత ఆ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story