కాంగ్రెస్ వస్తే మళ్లీ ఆకలి చావులే ఉంటాయి : సీఎం కేసీఆర్

సమైక్యవాదులంతా కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని సీఎం కేసీఆర్ అన్నారు.

By Medi Samrat  Published on  28 Nov 2023 3:40 PM IST
కాంగ్రెస్ వస్తే మళ్లీ ఆకలి చావులే ఉంటాయి : సీఎం కేసీఆర్

సమైక్యవాదులంతా కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ ఒచ్చుడో అని తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధమయ్యాన‌ని పేర్కొన్నారు. తాను తెలంగాణ ఆశగా, శ్వాసగా బ్రతుకుతున్నానని వెల్ల‌డించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని కాంగ్రెస్ అంటుంది.. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని ప్ర‌శ్నించారు.

ఇందిరమ్మ రాజ్యంలో అన్ని చీకటి రోజులేన‌ని కేసీఆర్ అన్నారు. రైతుబంధును భారతదేశంలో ప్రవేశపెట్టింది కేసీఆర్ మాత్రమేన‌ని తెలిపారు. సమైక్యవాదులు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు పన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ అధికారాన్ని రైతులకు ఇచ్చిందని వెల్ల‌డించారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ ఆకలి చావులే ఉంటాయని హెచ్చ‌రించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రైతుబంధు 16,000 చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

Next Story