సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

CM KCR Slightly Unwell. తెలంగాణ‌ ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

By Medi Samrat  Published on  12 March 2023 4:55 PM IST
సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

CM KCR


తెలంగాణ‌ ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పితో బాధ‌ప‌డుతుండ‌టంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఏఐజీ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి నేతృత్వంలో సీఎం కేసీఆర్‌కు అన్ని వైద్య పరీక్షలు చేశారు. సీటీ స్కాన్‌, ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సీఎంకు కడుపులో కొద్దిపాటి అల్సర్‌ ఉన్నట్లు.. మందులతో ఆ అల్సర్‌ తగ్గిపోతుందని వైద్యులు తెలిపారు. అల్స‌ర్ మిన‌హా సీఎం ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయిలోనే ఉందని.. ప్రాథమికంగా కొన్ని మందులు రిఫర్ చేశామని వైద్యులు తెలిపారు.





Next Story