MLC Kavitha: సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ.. అర్ధరాత్రి ఆ విషయంపై చర్చ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవిత.. దేశ రాజధాని ఢిల్లీ నుండి తిరిగి వచ్చి తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.

By అంజి  Published on  12 March 2023 9:36 AM IST
MLC Kavitha,CM KCR, Enforcement Directorate

సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ

హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించిన తర్వాత, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కె. కవిత.. ఢిల్లీ నుండి తిరిగి వచ్చి తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. శనివారం అర్ధరాత్రి 12.10 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు చేరుకున్న కవిత.. తెలంగాణ మంత్రులు కేటీ రామారావు, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ కు చేరుకున్నారు. కవితను ఢిల్లీలో ఈడీ ప్రశ్నించడాన్ని కేసీఆర్‌కు వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈడీ విచారణ జరిగిన తీరు, వారు సంధించిన ప్రశ్నలను గురించి వివరించినట్లు సమాచారం.

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంపై శనివారం కవితను ఈడీ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. మార్చి 16న తదుపరి విచారణ కోసం ఆమెకు మళ్లీ సమన్లు ​​జారీ చేసింది. ఈడీ ప్రకారం.. కవిత 'సౌత్ గ్రూప్'లో ఒక భాగమని, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలోని లొసుగులను ఉపయోగించుకోవడానికి, వివిధ హోల్‌సేల్ వ్యాపారాలు, రిటైల్ జోన్‌లకు ఉచిత ప్రాప్యతను పొందేందుకు లంచాలు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. సౌత్ గ్రూప్ లో రామచంద్ర పిళ్లై, సమీర్ మహీంద్రూ, మాగుంట శ్రీనివాస్ రెడ్డికి 65 శాతం పార్టనర్ షిప్ ఉన్నట్లు ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూప కల్పనలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, కవిత మధ్య రాజకీయ అవగాహన కుదిరిందని ఈడీ పేర్కొంది.

Next Story