అర్చ‌కుల‌కు శుభ‌వార్త చెప్పిన సీఎం కేసీఆర్‌.. గౌర‌వ‌భృతి రూ. 5 వేల‌కు పెంపు

CM KCR Says Good News For Brahmins In Telangana. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గోప‌న్‌ప‌ల్లిలో నిర్మించిన 'విప్ర‌హిత' బ్రాహ్మ‌ణ సంక్షేమ‌ స‌ద‌నాన్ని

By Medi Samrat  Published on  31 May 2023 9:32 AM GMT
అర్చ‌కుల‌కు శుభ‌వార్త చెప్పిన సీఎం కేసీఆర్‌.. గౌర‌వ‌భృతి రూ. 5 వేల‌కు పెంపు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గోప‌న్‌ప‌ల్లిలో నిర్మించిన 'విప్ర‌హిత' బ్రాహ్మ‌ణ సంక్షేమ‌ స‌ద‌నాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బుధ‌వారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా.. రాష్ట్రంలోని అర్చ‌కుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త చెప్పారు. తెలంగాణ ప్ర‌భుత్వం అర్చ‌కుల‌కు ప్ర‌తి నెల ఇస్తున్న గౌర‌వ‌భ‌వృతిని రూ. 2,500 నుంచి రూ. 5 వేల‌కు పెంచుతున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. అలాగే భృతిని పొందే అర్హ‌త వ‌య‌సును 75 ఏండ్ల నుంచి 65 ఏండ్ల‌కు త‌గ్గిస్తున్నట్లు ప్ర‌క‌టించారు.

రాష్ట్రంలో ధూప‌దీప నైవేద్యం ప‌థ‌కం కింద దేవాల‌యాల నిర్వ‌హ‌ణ కోసం అర్చ‌కుల‌కు నెల‌కు రూ. 6 వేల చొప్పున ప్ర‌భుత్వం అందిస్తున్న‌ది. ఈ మొత్తాన్ని రూ. 10 వేల‌కు పెంచుతున్నామ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే వేద పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ కోసం ఇస్తున్న రూ. 2 ల‌క్ష‌లను ఇక నుంచి యాన్యువ‌ల్ గ్రాంట్‌గా ఇస్తామ‌ని తెలిపారు. ఐటీఎం, ఐఐఎం లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌ల్లో చ‌దివే బ్రాహ్మ‌ణ విద్యార్థుల‌కు ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని వ‌ర్తింజేసే నిర్ణ‌యం తీసుకున్నట్లు వెల్ల‌డించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ కెవి. రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story