వీఆర్ఏల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణపై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

CM KCR Review On VRAs Regularization In Telangana. రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ సచివాలయంలో

By Medi Samrat
Published on : 23 July 2023 4:45 PM IST

వీఆర్ఏల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణపై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. నీటి పారుద‌ల స‌హా ఇత‌ర శాఖ‌ల్లో వీఆర్ఏల‌ను స‌ర్దుబాటు చేసే విష‌య‌మై చ‌ర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఏ జీవన్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు సోమేష్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయూడీ అరవింద్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, దాసోజు శ్రవణ్, వీఆర్ఏ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story