మనీశ్ సిసోడియా అరెస్టును ఖండించిన కేసీఆర్

CM KCR response on delhi liquor scam case during manish sisodia arrest. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అధికారులు నిందితులుగా భావిస్తున్న

By Medi Samrat
Published on : 27 Feb 2023 8:53 PM IST

మనీశ్ సిసోడియా అరెస్టును ఖండించిన కేసీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అధికారులు నిందితులుగా భావిస్తున్న వారిని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివ‌ర‌కూ 11 మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. నిన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారు. మనీశ్ సిసోడియా అరెస్టు నేఫ‌థ్యంలో ఈ కేసుపై మొదటిసారిగా సీఎం కేసీఆర్ స్పందించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టును కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. అదానీ అంశంపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. ఈ అరెస్టులు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. అదానీకి ప్రధాని మోదీకి మధ్య ఉన్న అనుబంధం చర్చ జరగకుండా ఉండేందుకే ఈ అరెస్టులని కేసీఆర్ ఆక్షేపించారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ కేసుపై స్పందించని సీఎం కేసీఆర్.. మొదటి సారి స్పందించటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.



Next Story