ప్రధాని మోదీతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

CM KCR Meet PM Modi. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని న‌రేంద్ర‌ మోదీతో భేటీ అయ్యారు.

By Medi Samrat  Published on  12 Dec 2020 3:01 PM GMT
ప్రధాని మోదీతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని న‌రేంద్ర‌ మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాలపై సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించారు. నిన్న ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. అప్ప‌టి నుంచి పలువురు కేంద్రమంత్రులను కేసీఆర్ కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చర్చించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలపై ప్రధాని మోదీతో కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం.

అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సహకారం, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు, జీఎస్టీ బకాయిలకు సంబంధించిన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా తక్షణ నిధులు మంజూరు చేసే విషయంపై ప్రధానితో కేసీఆర్‌ చర్చించినట్లు తెలుస్తోంది.
Next Story
Share it