రైల్వే పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించండి : మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
CM KCR Letter to PM. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం లేఖ రాశారు.
By Medi Samrat Published on
20 Nov 2020 8:33 AM GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ రంగ రైల్వే పరీక్షలను రెండు భాషల్లోనే నిర్వహిస్తున్నారనీ.. ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించేందుకు అనుమతించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.
రాష్ట్రపతికి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ
దేశ మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు స్మారక తపాలా స్టాంప్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. స్టాంప్‌ను హైదరాబాద్‌లో విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. పీవీకి భారతరత్న పురష్కారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
Next Story