బీజేపీని దేశంలో ఎవరూ నమ్మడం లేదు.. రేపు ఢిల్లీకి వెళ్తున్నాం..

CM KCR Fires On Center. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ఎన్నిసార్లు డిమాండ్‌ చేసినా కేంద్రం స్పందించడం లేదని

By Medi Samrat  Published on  20 Nov 2021 7:57 PM IST
బీజేపీని దేశంలో ఎవరూ నమ్మడం లేదు.. రేపు ఢిల్లీకి వెళ్తున్నాం..

వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ఎన్నిసార్లు డిమాండ్‌ చేసినా కేంద్రం స్పందించడం లేదని.. సరైన స్పష్టత ఇవ్వడం లేదని.. చివరి ప్రయత్నంగా ఆదివారం ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని వార్త వచ్చింది. అది గాలివార్తా లేక నిజమా అనేది తెలుసుకుంటామ‌ని.. ఈ విష‌య‌మై అవకాశం ఉంటే ప్రధాని మోదీని కూడా కలుస్తామని తెలిపారు. సాగు చట్టాలపై కేంద్రం క్షమాపణ చెప్తే సరిపోదన్నారు. రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

సాగుచట్టంపై పోరాటంలో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని.. చనిపోయిన రైతు కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం. రైతు ఆందోళనలో చనిపోయిన ప్రతిరైతు కుటుంబానికి తెలంగాణప్రభుత్వం తరపున రూ.3 లక్షలు అందిస్తామ‌ని.. కేంద్రం కూడా ఆ కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడాన్ని ఎన్నికల స్టంట్ అంటున్నారని.. బీజేపీని దేశంలో ఎవరు నమ్మడం లేదని కేసీఆర్ అన్నారు. విద్యుత్ చట్టం తెచ్చి రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నారని.. మా రాష్ట్రంలో మీటర్లు పెట్టే ఉద్దేశం లేదని స్ప‌ష్టంచేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మీటర్లు పెట్టుకుంటే ఇబ్బంది లేదని.. విద్యుత్ చట్టాలన్ని వెంటనే కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఛేశారు.


Next Story