మోదీని అధికారం నుండి తరిమికొట్టడం ఖాయం : కేసీఆర్

CM KCR Fire On BJP govt. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat  Published on  11 Feb 2022 2:25 PM GMT
మోదీని అధికారం నుండి తరిమికొట్టడం ఖాయం : కేసీఆర్

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పెట్టుకుంటే ఢిల్లీ కోట‌లు బ‌ద్ద‌లు కొడుతామని.. న‌రేంద్ర మోదీ జాగ్ర‌త్త అని కేసీఆర్ హెచ్చ‌రించారు. జ‌న‌గామ య‌శ్వంత్‌పూర్‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ప్రధాని నరేంద్ర మోదీపై తన విమర్శలను కేసీఆర్ కొనసాగిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం సహకారం అందించడంలో విఫలమైతే, మోదీని అధికారం నుండి తరిమికొట్టడం ఖాయమని కేసీఆర్ శుక్రవారం అన్నారు. అవసరమైతే ఢిల్లీ కోటను బద్దలు కొట్టేందుకు జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేసీఆర్ చెప్పారు. మీరు మాకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు, మీరు మాకు మెడికల్ కాలేజీ ఇవ్వరు…మీరు మాకు మద్దతు ఇవ్వకపోతే, సమస్య లేదు. మిమ్మల్ని అధికారం నుంచి తరిమికొట్టి మాకు అండగా ఉండే ప్రభుత్వాన్ని తీసుకొస్తామని కేసీఆర్ అన్నారు.

తెలంగాణలో ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదని ఆయన ఖరాఖండిగా చెప్పారు. "అవసరమైతే, జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటే, ఖచ్చితంగా మన దేశం కోసం పోరాడాలి... మీరు (ప్రజలు) నన్ను ఆశీర్వదిస్తే నేను ఢిల్లీ కోటను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నరేంద్ర మోదీ గారు జాగ్రత్తగా ఉండండి. మీ బెదిరింపులకు ఎవరూ భయపడేవారు కాదు, "అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. జ‌న‌గామ టౌన్‌లో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను బీజేపీ వాళ్లు కొట్టారు. బీజేపీ వాళ్ల‌ను మేం ట‌చ్ చేయం.. మ‌మ్మ‌ల్ని ముట్టుకుంటే నాశ‌నం చేస్తాం. మేం ఊదితే మీరు అడ్ర‌స్ లేకుండా పోతారని అన్నారు. 'ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌రు. కాజీపేట కోచ్ ఫ్యాక్ట‌రీ ఇవ్వ‌రు. మెడిక‌ల్ కాలేజీ ఇవ్వ‌రు. నువ్వు ఇవ్వ‌కున్నా మంచిదే.. ఈ దేశం నుంచి నిన్ను త‌రిమేసి.. ఇచ్చేటోన్ని తీసుకొచ్చుకుంటాం' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.


Next Story
Share it