బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ప్రమాదం.. ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
Cm Kcr Condolence To Karepally Incident. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.
By Medi Samrat
Cm Kcr Condolence To Karepally Incident
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో భారీ ఎత్తున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నామ నాగేశ్వరావు, ఎమ్మెల్యే రాములు వస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అయితే నిప్పురవ్వలు ఓ గుడిసెపై పడ్డాయి. అక్కడ మంట అంటుకోవడంతో గుడిసెలో ఉన్న సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి, సిలిండర్ పేలుడు ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ నామా నాగేశ్వర్ రావు చెప్పారు. తాము ఏర్పాటు చేసుకున్న మీటింగ్ కు 200 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందన్నారు. మీటింగ్ ప్రారంభయ్యే సమయంలో తామంతా స్టేజీపై ఉన్నామని, అప్పుడే సిలిండర్ పేలిందని అన్నారు.
అండగా ఉంటామని చెప్పిన సీఎం కేసీఆర్
ఖమ్మం జిల్లా చీమలపాడులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోరం జరిగింది. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసిన కొద్దీ దూరంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. దాదాపు 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డ వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.
ఈ ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కేసీఆర్ ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు కూడా ఫోన్ చేసి, ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు సీఎం కేసీఆర్ పార్టీ తరుపున రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు తన తరుపున ప్రత్యేకంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయాలైన వారికి రూ. 50 వేలు ప్రకటించారు.