ఆ గొడవను సెటిల్ చేసిన హరీశ్‌రావు

బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలంగాణ భవన్ లోనే ఈ దాడులు జరిగాయి.

By Medi Samrat  Published on  5 Jan 2024 3:00 PM GMT
ఆ గొడవను సెటిల్ చేసిన హరీశ్‌రావు

బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలంగాణ భవన్ లోనే ఈ దాడులు జరిగాయి. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన చేవెళ్ల లోక్‌సభ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. సమావేశంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతుండగా పైలెట్ రోహిత్ రెడ్డి వర్గం నినాదాలు చేయడంతో గొడవ మొదలైంది. ఇరువర్గాల నాయకులు పరస్పర నినాదాలతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం తలెత్తింది. మాజీ మంత్రి హరీశ్‌రావు కలగజేసుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో ఇరు వర్గాల నేతలు శాంతించారు.

ఇక మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డితో హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమీక్ష సమావేశంలో గొడవపడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న హరీష్ రావు ఇద్దరు నేతలకు సర్ధి చెప్పినట్లు తెలిసింది.

Next Story