సీఐ వాహనంతో యువకుడు పరార్‌..!

Circle Inspector Vehicle Was Stolen. నల్గొండ జిల్లాలో పోలీసుల కళ్లుగప్పి సీఐ వాహనాన్నే ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  13 Nov 2020 9:24 AM IST
సీఐ వాహనంతో యువకుడు పరార్‌..!

నల్గొండ జిల్లాలో పోలీసుల కళ్లుగప్పి సీఐ వాహనాన్నే ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మిర్యాలగూడ ప‌ట్ట‌ణం ‌ ఈదులగూడ సర్కిల్‌ వద్ద రూరల్‌ సీఐ రమేష్‌ బాబు పోలీస్‌ వాహనం చోరికి గురైంది. గురువారం అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న నలుగురు యువకులను సీఐ విచారిస్తుండగా.. పోలీసుల కళ్లుగప్పి ఓ యువకుడు సీఐ వాహనంతో కోదాడ వైపు పరారయ్యారు.

ఈ క్రమంలో ఎదరుగా వస్తున్న వాహనాన్ని పోలీస్‌ వాహనం ఢీకొనడంతో కారు ముందు భాగం ధ్వంసమయ్యింది. అయితే.. పోలీసులు చేజింగ్‌ చేసి.. ఆలగడప టోల్‌గేట్‌ వద్ద వాహనాన్ని రూరల్‌ ఎస్‌ఐ పరమేష్‌ పట్టుకున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Next Story