ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో రేపు, ఎల్లుండి పబ్లిక్ హాలిడేలు ఉండటంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చినట్టైంది. క్రిస్మస్ పండుగ, బాక్సింగ్ డే వంటి ప్రత్యేక రోజులు వస్తుండటంతో వరుస సెలవులు ఇచ్చినట్టు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 2025 ఏడాదికి సంబంధించి సాధారణ , ఆప్షనల్ సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జాబితా ప్రకారం.. మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నట్లు జాబితాలో పొందుపరిచింది. ఈ సెలవుల్లో మొదట జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ఉంటుంది.
ఏపీలో రేపు పబ్లిక్ హాలిడే ఉండగా, 26న ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈసారి క్రిస్మస్ పండుగకు స్కూళ్లు, కాలేజీలకు ఒక్కరోజు మాత్రమే సెలవు రానుంది. క్రిస్టియన్ మైనార్టీ స్కూళ్లు, కాలేజీలు మాత్రం ఆప్షనల్ హాలిడే రోజున కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది. ఏపీలో 2025 సంవత్సరానికి సంబంధించి మొత్తం 23 సాధారణ సెలవులు.. 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేలు రెండూ కలుపుకొని మొత్తంగా 44 రోజులు సెలవులు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.