ఇవాళ్టి నుంచి స్కూళ్లకు సెలవులు

క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని మిషనరీ స్కూళ్లకు డిసెంబర్‌ 22 నుంచి 26వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి.

By అంజి  Published on  22 Dec 2023 2:30 AM GMT
Christmas, holidays, schools, Telangana

ఇవాళ్టి నుంచి స్కూళ్లకు సెలవులు

క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని మిషనరీ స్కూళ్లకు డిసెంబర్‌ 22 నుంచి 26వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. కొన్ని స్కూళ్లకు డిసెంబర్‌ 25, 26 (బాక్సిండ్‌ డే) తేదీల్లో సెలవు ప్రకటించా, మరికొన్ని స్కూళ్లకు డిసెంబర్‌ 25న మాత్రమే ఇచ్చారు. డిసెంబర్‌ 26వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. మొత్తానికి డిసెంబర్ 24 ఆదివారం, డిసెంబర్ 25 క్రిస్మస్ సోమవారం రావడంతో స్కూళ్లు, కాలేజీలకు వరుసుగా రెండు రోజులు సెలవులు ఉండనున్నాయి.

ఇదిలా ఉంటే.. జనవరిలో మరోసారి విద్యా సంస్థలకు హాలీడేస్‌ రాబోతున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతో కలిపి వరుసగా ఆరు రోజులు సెలవులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 27 సాధారణ సెలవులు ప్రకటించగా.. 25 ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన సాధారణ సెలవుల్లో కొన్ని ఆదివారాలుండటం విశేషం. అటు ఏపీలోని స్కూళ్లకు 25, 26 తేదీల్లో సెలవు ఉండనుంది. కొన్ని చోట్ల రేపు కూడా సెలవు ఉండనుంది.

Next Story